"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" కి ‘U' సర్టిఫికెట్
posted on Jan 8, 2013 @ 5:05PM
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న మల్టీస్టారర్ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ ‘U' సర్టిఫికెట్ జారి చేసింది. అందరు అనుకున్నట్లుగానే సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సర్టిఫికెట్ దక్కిచుకుంది. 25 సంవత్సరాల తర్వాత టాలీవుడ్ లో వస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రాన్ని జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఇటీవల విడుదలైన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమాలో మహేష్ పక్కన సమంత, వెంకటేష్ పక్కన అంజలి హీరోయిన్లు గా నటిస్తున్నారు.ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం ముఖ్యమైన పత్రాలను పోషిస్తున్నారు. ఈచిత్రానికి సంగీతం : మిక్కీజె మేయర్, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, సినిమాటోగ్రఫీ : గుహన్, ఫైట్స్: విజయ్.